ఆన్లైన్ లో సులభంగా వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడానికి మంచి టూల్స్ ఇవి!
మీ phone ద్వారా క్యాప్చర్ చేసుకున్న వీడియోలను ఎలాంటి ప్రత్యేకమైన అప్లికేషన్ అవసరం లేకుండా నేరుగా ఆన్లైన్లో ఎడిటింగ్ చేసుకోవడం కోసం అనేక రకాల వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి వివరంగా చూద్దాం.
Kapwing
రోజువారి మనకు అవసరమయ్యే అనేక రకాల వీడియో ఎడిటింగ్ పనుల కోసం ఇది మాడ్యూల్స్ అందిస్తుంది. ఉదాహరణకు దీంట్లో ఉండే రీసైజింగ్ టూల్ ఉపయోగిస్తే, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వివిధ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అప్లోడ్ చేసుకోగలిగే విధంగా మీ దగ్గర ఉన్న వీడియోలను ఇది సంబంధిత ఫార్మెట్లో, aspect ratioలలో రీసైజ్ చేసిపెడుతుంది. అంతేకాదు మీ దగ్గర ఉన్న వీడియోలకు అదనంగా subtitles జత చేసుకోవాలి అంటే కూడా ఇది ఉపయోగించవచ్చు.
VideoLouder
కొన్నిసార్లు మనం క్యాప్చర్ చేసిన వీడియోలో ఆడియో లెవెల్స్ సక్రమంగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని మళ్లీ షూట్ చేయాల్సిన పని లేకుండా, మీకు నచ్చినట్టుగా ఆడియోని పెంచుకోవటానికి, లేదా తగ్గించుకోవటానికి ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. ఇందులో అన్ని రకాల ప్రముఖ వీడియో ఫార్మెట్లు సపోర్ట్ చేయబడతాయి. అంతేకాదు ఒక వీడియో లో ఉండే ఆడియో ను సపరేట్ చేసి దాని విడిగా సేవ్ చేసుకునే అవకాశం కూడా ఇది మనకు కల్పిస్తుంది. వీడియో ఫైల్ సైజ్ తగ్గించుకునే వెసులుబాటు కూడా ఇది అందిస్తుంది.
Compressify
Whatsappలో ఒక వీడియో షేర్ చేసుకోవాలంటే ఫైల్ సైజ్ పరంగా లిమిటేషన్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీ దగ్గర ఉన్న ఏదైనా వీడియో ఫైల్ ని చాలా సులభంగా మీరు చాలా సులభంగా మీకు కావలసిన పరిమాణంలోకి కంప్రెస్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ ప్రయత్నించవచ్చు. పైన చెప్పబడిన మిగతా వెబ్సైట్ల మాదిరిగా దీంట్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
RotateMyVideo.net
కొన్నిసార్లు మనం వీడియో షూట్ చేసే ఓరియంటేషన్ భిన్నంగా ఉంటుంది. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న వీడియోని మనకు నచ్చిన ఓరియంటేషన్ లో చాలా సులభంగా రొటేట్ చేసుకోవడం కోసం ఈ వెబ్సైట్ ఉపయోగించవచ్చు. అంతేకాదు వీడియో యొక్క aspect ratioతో దీంతో మార్పిడి చేసుకోవచ్చు.
Online Video-Cutter
సుదీర్ఘ కాలంగా అందుబాటులో ఉన్న వెబ్సైట్ ఇది. మీ దగ్గర ఉన్న వీడియోలో అనవసరమైన భాగాన్ని ట్రిమ్ చేసుకోవాలన్నా, లేదా వీడియో ఫ్రేమ్ లో కొద్ది భాగాన్ని క్రాప్ చేసుకోవాలన్నా, లేదా నచ్చిన యాంగిల్ లోకి rotate చేసుకోవాలన్నా, ఒక ఫార్మేట్ నుండి మరో ఫార్మేట్ కి కన్వర్ట్ చేసుకోవాలన్నా ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. గరిష్టంగా 500MB సైజు కలిగిన ఫైళ్లను మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది.
0 Comments