మీ Android phoneకి యాంటీవైరస్ అవసరమా?by pavan buddhu


మీ Android phoneకి యాంటీవైరస్ అవసరమా?


మీ దగ్గర ఉన్న Android phoneని  మాల్వేర్ నుండి రక్షించుకోవడం కోసం కంప్యూటర్ల మాదిరిగా తప్పనిసరిగా యాంటీవైరస్ వాడాలా?  ఒకవేళ వాడాల్సి వస్తే ఎలాంటిది వాడాలి అన్నది ఇప్పుడు వివరంగా చూద్దాం.
వాస్తవానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్స్ విషయంలో యాంటీవైరస్ పెద్దగా అవసరం లేదు.  కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫోన్ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. ప్రధానంగా Google Play Store లో చాలా కాలం నుండి google play protect అనే  ఒక ప్రత్యేకమైన సదుపాయం అందిస్తోంది. 
ఇది పరోక్షంగా క్లౌడ్ యాంటీ వైరస్ లాగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఫోన్స్ లో ఇన్స్టాల్ చేయబడిన అప్లికేషన్స్‌ని  ఇది బ్యాక్ గ్రౌండ్ లో నిశితంగా పరిశీలిస్తూ, అవి ఏమైనా ప్రమాదకరమైన పనులు చేస్తున్నట్లయితే ఆ ప్రక్రియ మొత్తాన్ని విశ్లేషించడం ద్వారా, అదే అప్లికేషన్ వాడుతున్న మిగిలిన యూజర్లను కూడా ఇది అలర్ట్ చేస్తుంది.

ఉదాహరణకు ఇటీవల CamScanner  సెక్యూరిటీ లోపం గురించి బయట పడిన సందర్భంలో, మీ దగ్గర ఎలాంటి యాంటీవైరస్ లేకపోయినా కూడా గూగుల్ ప్లేస్టోర్ క్యాం స్కానర్ కలిగి ఉంటే తొలగించమని అలర్ట్ జారీ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.  కాబట్టి మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుండి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నంత కాలం ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఒకవేళ మీరు ప్లే స్టోర్ నుండి కాకుండా పైరేటెడ్ అప్లికేషన్స్ లేదా గేమ్స్ డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మాత్రమే మీ ఫోన్ కి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది.


అలాంటి పైరేటెడ్ అప్లికేషన్స్ విషయంలో ఏంటి వైరస్ ఉపయోగపడుతుంది కదా అనే సందేహం మీకు కలగొచ్చు. వాస్తవానికి అన్ని పాపులర్ యాంటీవైరస్ అప్లికేషన్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం  లభిస్తున్నప్పటికీ వాటిలో అధిక శాతం అప్లికేషన్లు ప్రమాదకరమైన మాల్వేర్లని ఏమాత్రం గుర్తించలేక పోతున్నాయి. అలాంటప్పుడు వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం అన్న పరోక్షంగా ఫోన్స్ స్లో కావడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ యాంటీవైరస్ వాడితేనే మీరు సంతృప్తి గా ఉంటారని  భావిస్తే Avast mobile security, AVG antivirus free, Bitdefender mobile security, Kaspersky Internet Security, McAfee Mobile Security, Norton mobile security, sophos mobile security, trend micro mobile security వంటి యాంటీవైరస్ అప్లికేషన్స్ ప్రయత్నించవచ్చు.


0 Comments