మీ మొబైల్ ఫోన్ కి నిజంగా స్క్రీన్ ప్రొటెక్టర్ అవసరమా

 కొత్తగా ఒక స్మార్ట్ ఫోన్ కొన్న వెంటనే చాలామంది చేసే పని ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద ఆంటిస్తూ ఉంటారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే స్క్రీన్ ప్రొటెక్టర్ అవసరమా అన్నది ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఒకప్పుడు కేవలం హై-ఎండ్ ఫోన్లకి మాత్రమే  గొరిల్లా గ్లాస్ రక్షణ లభించేది. ఫోన్ కిందపడిన గానీ, లేదా కీస్ వంటివి తగిలినా గానీ గీతలు పడని విధంగా  గొరిల్లా గ్లాస్ రక్షణ కల్పిస్తుంది. ఉదాహరణకి ప్రస్తుతం గొరిల్లా గ్లాస్ 6 వినియోగంలో ఉంది. అన్ని ఫోన్ తయారీ కంపెనీలు ఈ లేటెస్ట్ మోడల్ వాడకపోయినప్పటికీ కనీసం దీని ముందు మోడల్ అయినా వాడుతూ ఉంటాయి. కాబట్టి ఫోన్ కింద పడిన కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఈ నేపధ్యంలో మీరు కొత్తగా ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు, దానికి గొరిల్లా గ్లాస్ రక్షణ లభిస్తుందా లేదా అనేది పరిశీలించండి.  ఒకవేళ గొరిల్లా గ్లాస్ రక్షణ లభిస్తుంటే ఎట్టిపరిస్థితుల్లో స్క్రీన్ ప్రొటెక్టర్ గానీ, టాంపర్డ్ గ్లాస్ గానీ వాడాల్సిన పనిలేదు. వీటిని వాడడం వల్ల చాలావరకు స్క్రీన్ మీద వ్యూయబులిటీ, షార్ప్‌నెస్ తగ్గిపోతుంది. అంతేకాదు స్క్రీన్ ప్రొటెక్టర్ వాడినప్పుడు కొన్ని సార్లు చిన్న చిన్న బబుల్స్ ఏర్పడే  అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫోన్ చూడడానికి ఇబ్బందికరంగా కనిపిస్తుంది.

ఈ ఇబ్బందులతో పాటు స్క్రీన్ ప్రొటెక్టర్ వాడినప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ యొక్క టచ్ సెన్సిటివిటీ చాలా వరకు తగ్గిపోతుంది. ఆంటే స్క్రీన్ ప్రొటెక్టర్ వాడటం కంటే ముందు లభించినంత స్మూత్ ఎక్స్పీరియన్స్ స్క్రీన్ ప్రొటెక్టర్ వాడిన తర్వాత మనకు లభించదు. ఇలా ఎన్నో రకాల సమస్యలు స్క్రీన్ ప్రొటెక్టర్ లతో ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటం మంచిది. వీటిని అప్లై చేసేటప్పుడు కూడా మొబైల్ రిపేర్ షాప్‌ల వాళ్లు  ఎంత ప్రయత్నించినా కూడా చిన్న చిన్న లోపాలు ఏర్పడతాయి కాబట్టి, వాటివల్ల ఫోన్ చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది.

PavanBuddhu
Subscribe our channel  

Facebook 
https://www.facebook.com/pavanbuddhu.pn/

0 Comments

Oldest