మీ phoneకి వచ్చే OTPలు, 2-స్టెప్ కోడ్‌ల దొంగిలించే టూల్ వచ్చింది!
OTP తెలిస్తే చాలు.. బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది! అంతేకాదు, మీ ఫోన్ కి వచ్చే 2-step verification code తెలిస్తే చాలు.. మీ Google, Facebook వంటి అన్నీ అకౌంట్లు కాంప్రమైజ్ అవుతాయి.
చాలామంది తమ phoneకి వచ్చే OTPలు, వెరిఫికేషన్ కోడ్ లు ఎవరూ చూడలేరు అనే ధీమాలో ఉంటుంటారు. మీ ఫోన్ హ్యాక్ చేయడం ద్వారా చాలా సులభంగా మీ ఫోన్ కు వచ్చే ఎస్ఎంఎస్ లు తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫోన్లో సేవ్ అయి ఉన్న కుకీలను దొంగిలించడం ద్వారా ఇప్పటికీ మీరు లాగిన్ అయి ఉన్న Google, Facebook సెషన్లని కూడా కంట్రోల్లోకి తీసుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తయితే, తాజాగా ఇరాన్‌కి చెందిన హ్యాకర్లు ఒక అత్యంత ప్రమాదకరమైన Android Malware అభివృద్ధి చేసినట్టు వెలుగులోకి వచ్చింది. చాలాకాలంగా దీన్ని అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నట్లు ప్రముఖ యాంటీవైరస్ సంస్థ Check Point వెలుగులోకి తీసుకొచ్చింది.
Rampant Kitten అని పిలవబడే ఈ మాల్వేర్‌ని వివిధ మార్గాల ద్వారా మీ ఫోన్ లోకి ప్రవేశ పెట్టడం ద్వారా, ఇకమీదట మీకు తెలియకుండానే మీ ఫోన్ కి వచ్చే OTPలు, 2-step verification codeలను హ్యాకర్లు తెలుసుకుంటారు. తద్వారా మీ అకౌంట్ పూర్తిగా వారి కంట్రోల్ లోకి వెళ్తుంది. ఇదంతా పగడ్బందీగా అమలుపరచబడుతుంది. మొట్టమొదట మీకు Gmail లేదా Facebookది ఓ ఫిషింగ్ లింక్ వివిధ పద్ధతుల ద్వారా పంపిస్తారు.
గమనిక: అన్ని లేటెస్ట్ Tech Updates కోసం ఫాలో అవ్వండి
అది నిజమైన జీమెయిల్ లాగిన్ పేజీ అని భావించి రెండో ఆలోచన లేకుండా మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే, ఆ వివరాలు సంబంధిత హ్యాకర్‌కి వెళ్లిపోతాయి. ఆ తర్వాత మీ ఫోన్ కి వచ్చే టు స్టెప్ వెరిఫికేషన్ కోడ్‌ని అప్పటికే మీ ఫోన్లో ఉన్న ప్రమాదకరమైన మాల్వేర్ ఆ హ్యాకర్‌కి చేరవేస్తుంది. దాంతో అతను మీ ఎకౌంట్ సొంతం చేసుకుంటాడు. ఈ పద్ధతి ద్వారా దాదాపు మీకు ఇంటర్నెట్ లో ఉన్న అన్ని అకౌంట్లు కాంప్రమైజ్ చేస్తారు. దీనికి ఎలాంటి పరిష్కారం లేదు కాబట్టి, మన జాగ్రత్తలో మనం ఉండటం ఉత్తమం.
0 Comments